ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. ఇది అద్భుతం!

ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం. రెండు ఆరడుగుల పాములు డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. బెంగళూరుకు చెందిన వసుధ శర్మ అనే మహిళా బుధవారం తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. 36 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో రెండు పెద్ద పాములు ఒకదానితో ఒకటి ముడివేసుకుంటూ పైకి లేస్తూ.. డ్యాన్స్‌ చేస్తున్నాయి. ఇక ఈ వీడియోకు ఆమె ‘గోల్ఫ్‌ కోర్స్‌ స్టేడియం కాస్తా పాముల నృత్య ప్రదర్శనగా మారింది’ అంటూ ట్వీట్‌ చేశారు. అలాగే గ్రౌండ్‌లో పెరిగిన చెట్ట పోదల్లో రెండు పాములు డ్యాన్స్‌ చేస్తున్న ఈ వీడియోకు.. ‘ప్రకృతి అందంలో భాగం’ అనే క్యాప్షన్‌ను జత చేసి ఆటవీ అధికారులను ట్యాగ్‌ చేశారు.