ధర్మశాల : భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి వన్డేకు కరోనా భయం గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు తెలిసింది. కాగా హెచ్‌పీసీఏ స్టేడియం సామర్థ్యం 23వేలు కాగా సరాసరి ఎంతమంది హాజరయ్యారనేది తెలియదు కానీ స్టేడియంలో ప్రేక్షకులు సంఖ్య మాత్రం తక్కువగానే కనిపించింది. దీంతో కరోనా ప్రభావం మ్యాచ్‌పై గట్టిగానే ఉందని హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది. పరిస్థితి ఇలానే ఉంటే ఒకవేళ ఐపీఎల్ జరిగితే మాత్రం.. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరిగే అవకాశాలున్నాయి. ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహించాలా? వద్దా? అనే దానిపై మార్చి 14న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. (రికార్డు స్థాయి క్రికెట్ మ్యాచ్‌కు కరోనా బాధితుడు)
తొలి వన్డేకు కరోనా ఫీవర్!